ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలైన సంఘటనపై కేసు నమోదు చేసినట్లు పాల్వంచ రూరల్ పోలీసులు గురువారం రాత్రి పది గంటల 30 నిమిషాల సమయంలో తెలిపారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని పాత సూరారం గ్రామంలో సక్రు అనే వ్యక్తి రోడ్డుపై ఉండగా, శీను అనే వ్యక్తి ద్విచక్ర వాహనం వేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ సక్రును ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గాయాలయ్యాయి.. సక్రు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై సురేష్ తెలిపారు..