రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని విద్యార్థులు బంగారు పతకం కైవసం చేసుకొని జాతీయస్థాయి క్రీడలకు ఎంపిక కావడం చాలా సంతోషకరమని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ అన్నారు.శుక్రవారం నాడు తన చాంబర్లో 15 సంవత్సరాల లోపు వాలీబాల్ క్రీడలలో బంగారు పతకం సాధించిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.