నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని కమ్మర్పల్లి మండలంలో సోమవారం పలు కుటుంబాలను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. నాగపూర్ మాజీ సర్పంచ్ పాలెపు సాయమ్మ, టిఆర్ఎస్ నాయకులు కిరణ్ అనారోగ్యంతో బాధపడుతుండగా వారిని పరామర్శించారు. అలాగే హసకొత్తూరులో మెట్పల్లి సాయినా ఇటీవల అకాల మరణం చెందగా వారి కుటుంబాలను పరామర్శించారు.