వరంగల్ జిల్లా కిలా వరంగల్ మండలం మామునూరు 43వ డివిజన్ పరిధిలో ఎంపీ ఆఫీస్ నుంచి పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ గేటు వరకు మరియు సిసి రోడ్డు కల్వర్టు నిర్మాణం కోసం 86 లక్షల రూపాయల వ్యయంతో పనులకు మేరుతో కలిసి శంకుస్థాపన చేశారు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు నాకు చాలా అవినాభావ సంబంధం ఉందని నేను గతంలో పోలీస్ అధికారిగా ఎస్సై నుండి సిపి వరకు అంచలంచలుగా ఎదుగుతూ ముందుకు వచ్చానని ఆయన అన్నారు. తనకు పోలీస్ కష్టనష్టాలు ఇబ్బందులు అన్ని తెలుసు కాబట్టి కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్ని కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.