కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ సంయుక్త నిర్ణయం మేరకు పేద ప్రజల నిత్యవసర వస్తువులపై మరియు ఆటోమొబైల్ రంగంలోని వస్తువులపై గణనీయమైన రీతిలో జిఎస్టి తగ్గించారు. ఇది చరిత్రలో గొప్ప మైలురాయిగా నిలుస్తుందని నరేంద్ర మోడీ చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి పట్టణ గాంధీ చౌక్ లో పాలాభిషేకం చేయడం చేశారు. బిజెపి నాయకులు మాట్లాడుతూ ప్రతి సామాన్యుడికి నిత్యవసర వస్తువుల ధరలు భారంగా మారకుండా జిఎస్టిని తగ్గించి మధ్యతరగతి ప్రజానీకానికి చేరువయ్యేలాగా నిత్యవసర వస్తువులపై తగ్గించారన్నారు.