ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు.విశాఖపట్నం నుంచి తిరుపతి వెళుతున్న ఆర్టీసీ బస్సును అధికారులు మార్టూరులో తనిఖీ చేశారు.ఒరిస్సాకు చెందిన సురేష్ మహాపాత్ర అనే వ్యక్తి 5 కిలోల గంజాయిని తరలిస్తూ అధికారులకు పట్టుబడ్డాడు.గంజాయి సీజ్ చేసి నిందితుడిపై కేసు నమోదు చేశారు.కాగా ఇతనిపై తమిళనాడులో కూడా రెండు గంజాయి కేసులు ఉన్నాయని అధికారులు చెప్పారు.