ఎమ్మిగనూరు పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని పట్టణ ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిలక్ నగర్ కు చెందిన ఇద్దరు గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు స్కూలుకు వెళ్లే సమయంలో వీధి కుక్కలు వెంటపడి విద్యార్థులను కలవడంతో గాయాలైన విద్యార్థులను తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇలా విద్యార్థులను నిత్యం కుక్కలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని అయినా కూడా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు,విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.