వర్గల్ మండలం లో పర్యటించి పలు అభివృద్ధి పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ కె హైమావతి పరిశీలించారు. ఈ మేరకు ముందుగా వర్గల్ తహసిల్దార్ కార్యాలయంన్నీ జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను భూ భారతి చట్టం లోని మార్గదర్శకాల ప్రకారం డిస్పోజల్ ప్రక్రియ వేగవంతం చెయ్యాలని తహసిల్దార్ రఘువీర్ నీ ఆదేశించారు. కుల, ఆదాయ, రెసిడెన్షియల్ ఇతరత్రా సర్టిఫికెట్ లు వెరిఫై చేసి పెండింగ్ లో ఉండకుండా నిర్ణిత కాల వ్యవధిలో తప్పనిసరిగా సర్టిఫికెట్స్ ఇవ్వాలని ఆదేశించారు.