సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో యూరియా ఎరువుల కోసం మంగళవారం ఉదయం రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎరువుల కొరత కారణంగా రైతులు ఎక్కువసేపు క్యూల్లో నిలబడి ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు మంగళవారం తెలిపారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకొని యూరియా సరఫరా సక్రమంగా ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాబోయే వానాకాలం పంటలు నష్టపోకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.