ఉల్లి పంట సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధర క్వింటాకు 3000 తో ప్రభుత్వమే కొనుగోలు చేసే ఆదుకోకపోతే ఉద్యమం తప్పదని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు. గురువారం ఎర్రగుంట్ల మండలం దండుపల్లె వెల్దుర్తి, వీయన్ పల్లి మండలం కొమ్మది, తొండూరు మండలం గంగనపల్లి, చెర్లోపల్లి, ఊడగండ్ల, గంగాదేవి పల్లె గ్రామాల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం వి సుబ్బారెడ్డి, వెంకట్ రాముడు, హరిహర నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో దాదాపు పదివేల ఎకరాలలో ఉల్లి పంట సాగు చేసినట్లు ప్రాథమిక అంచనా అన్నారు.