వైసిపి పాలనలో కార్మికులకు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని మరియు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించడం విడ్డూరంగా ఉందని టిఎన్టియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. వైసిపి పాలనలోనే సంక్షేమ బోర్డును రద్దు చేశారన్న విషయాన్ని రామకృష్ణ గుర్తుంచుకోవాలని సూచించారు. శుక్రవారం రాజమండ్రి ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడుతూ స్థాయికి మించి విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.