ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో భారీ వర్షం కురుస్తుంది సబ్ డివిజన్ పరిధిలోని పాములపాడు, కొత్తపల్లి,వెలుగోడు, ఆత్మకూరు మండలాల్లో గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.వాగులు పొంగిపొర్లుతున్నాయి, గత వారం రోజులుగా తీవ్ర ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది.వేకువజామున నుంచి మధ్యాహ్నం వరకు ఏకధాటిగా వర్షం కురుస్తుండడంతో వర్షం ఇదేవిధంగా కొనసాగితే మొక్కజొన్న పంటకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని రైతును ఆందోళన చెందుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.