గుంటూరు రూరల్, జొన్నలగడ్డ గ్రామంలో 500 ఎకరాల్లో వరి ఎండిపోతుందని ఏపీ రైతు సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద కలెక్టర్లకు వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లాండ్రాప్ నుంచి పారుతున్న పంట కాలువలో తూటి కాడ, జమ్ము, రెల్లి నిండిపోవడం వల్ల నీరు కిందకి రాక పోవడం వల్ల సుమారు 500 ఎకరాలు ఎండిపోతున్నాయన్నారు.