అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిలు ఎదుర్కొంటున్న సమస్యలపై మంగళవారం భారత విద్యార్థి ఫెడరేషన్( ఎస్ఎఫ్ఐ ) ఆధ్వర్యంలో రెవిన్యూ భవనం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బాలికల కళాశాలకు సొంత భవనం ఏర్పాటు, ఒకేషనల్ కోర్సులు ఏర్పాటు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, ఉచిత బస్సు పాసులు అందించాలని తదితర సమస్యలపై రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి హరున్ రషీద్, పట్టణ కార్యదర్శి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.