గంట్యాడ మండలం కొర్లాం గ్రామంలో బుధవారం మధ్యాహ్నం పొలం పిలుస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా రైతులతో నిర్వహించిన సమావేశంలో ఏవో శ్యామ్ కుమార్ మాట్లాడుతూ నానో యూరియా వినియోగం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నందున రైతులు నానో యూరియా వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎరువుల యాజమాన్యం పై అవగాహన కల్పించారు. గ్రామ పెద్దలు, రైతులు, ఏఈఓ సునీల్ కుమార్, వి ఏ ఏ సత్య తదితరులు పాల్గొన్నారు.