Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 31, 2025
ప్రతాప్ రెడ్డి పదేళ్లు MLAగా ఉన్నప్పుడు తన క్వారీలో కనిపించని అవినీతి ఇప్పుడు తాను ఎమ్మెల్యే అయ్యే సరికి గుర్తు వచ్చిందా అని కావలి MLA కృష్ణారెడ్డి ప్రశ్నించారు. 'నువ్వు (ప్రతాప్ రెడ్డి) MLAగా ఉన్నప్పుడు నా క్వారీకి రూ.145 కోట్లు పెనాల్టీ వేశారు. నువ్వు ఏమి చేయలేక చేతులు ముడుచుకుని కూర్చున్నావు. నా క్వారీలో అక్రమాలు జరిగితే అధికారులకు చెప్పాలి కానీ రౌడీ షీటర్లను ఎందుకు పంపించావు' అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జరిగింది