భూ వివాదం దాయాదుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ దాడుల్లో గాయపడిన వ్యక్తి మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నం (M) దండుమైలారంలో జరిగింది. 10 గుంటల భూమి విషయంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా ఒకరిపై ఒకరు గొడ్డళ్లతో దాడి చేసుకున్నారు. ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.