కుల గణనలో మున్నూరు కాపుల జనాభా తక్కువగా చూపించి ఆ సామాజిక వర్గానికి తీరని ద్రోహం చేశారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టం పురుషోత్తమరావు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలో మున్నూరు కాపుల సంఘ సభ్యత్వం ప్రారంభించి మాట్లాడారు. రెండు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు పూర్తి చేసి మున్నూరు కాపుల సంఖ్యను ప్రభుత్వానికి చెప్తామన్నారు.