శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ మండలం మిట్టమీద పల్లి గేట్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రైవేట్ బస్సు ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.