అనంతపురం జిల్లా కేంద్రంలోమంగళవారం 11:30 నుంచి 1:00 వరకు వైయస్సార్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో రైతుపోరు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రైతు పోరు నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మద్దతు ధర గాని రైతులకు అవసరమైన ఎరువులు కానీ అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఇప్పటికైనా రైతులకు అవసరమైన యూరియాని ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తామని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు .