నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సిఎంసి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. శనివారం హాస్పిటల్ వద్దకు వచ్చిన చైర్మన్ షణ్ముఖ లింగం, డైరెక్టర్ జేఎన్ రావును సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. మెయిన్ గేటు తాళాలు తెరవకపోవడంతో సిబ్బందిపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంసీ వద్దకు చేరుకున్న డిచ్ పల్లి పోలీసులు సముదాయించడంతో అక్కడినుంచి వెళ్ళిపోయారు.