అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా శుక్రవారం ముస్లిం సోదరుల ఆరాధ్య దైవం మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకొని నిర్వహించే మిలాద్ ఉన్ నబి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉరవకొండ పట్టణంలో ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ర్యాలీలు జెండా ఊరేగింపులు నిర్వహించారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి మిలాద్ ఉన్ నబీ ప్రార్థన, జెండా ఊరేగింపు వేడుకల్లో పాల్గొన్న అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. మిలాద్ ఉన్ నబీ వేడుకలను నియోజకవర్గంలోని బెలుగుప్ప కూడేరు విడపనకల్లు వజ్రకరూర్ మండలాల్లో కూడా ముస్లిం సోదరులు నిర్వహించారు.