జగదేవ్‌పుర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామాన్ని అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) గరీమా అగ్రవాల్ మంగళవారం సందర్శించారు. గ్రామంలో ఇటీవల నమోదైన డెంగ్యూ కేసులు సంబంధించి బాధితులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అదనపు కలెక్టర్ గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బందికి పరిశుభ్రత, డ్రైనేజీ శుభ్రపరిచే పనులు, యాంటీ లార్వా చర్యలు తీసుకోవడం మరియు ప్రజల్లో అవగాహన కల్పించడం పై కఠినమైన సూచనలు ఇచ్చారు. అలాగే ప్రతి శుక్రవారం ఇంటింటా డ్రై డే పాటించాలనీ ఆదేశించారు. తిమ్మాపూర్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన (Mid-Day Meals) మెనూ ప్రజారంగంలో ఉంచుతున్నారా లేదా అని పరిశీలించారు. తరు