నల్గొండ జిల్లా, నిడమనూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై యూరియా కోసం రైతులు గురువారం మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఎరువుల దుకాణాలలో ఎరువులు ఉన్నప్పటికీ ఇవ్వకుండా బ్లాక్లో విక్రయిస్తున్నారని ఆరోపించారు. యూరియా లేకపోవడంతో పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో సంఘటన స్థలానికి చేరుకున్న హాలియా ఎస్సై సాయి ప్రశాంత్ రైతులకు నచ్చజెప్పి దానికి ప్రయత్నించి న్యాయం జరిగే విధంగా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.