సందర్శకుల కోసం సీపీ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక లౌంజ్ ప్రారంభంవరంగల్ పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సీపిని కలిసేందుకు వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గది (లౌంజ్)ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సోమవారం ప్రారంభించారు. సందర్శకులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ లౌంజ్ ఏర్పాటు చేయబడింది. ఇందులో కూర్చునే సౌకర్యాలు, త్రాగునీటి సదుపాయం, పత్రికలు వంటి అవసరమైన సౌకర్యాలు కల్పించబడ్డాయి