ఇకపై చౌక దుకాణాల ద్వారా పారదర్శకంగా నిత్యావసరాలు పొందడానికి స్మార్ట్ కార్డులు ఉపయోగపడతాయని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు మండలం మండపాకలో నిర్వహించిన స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ప్రచార పిచ్చితో రేషన్ కార్డులపై జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ముద్రించుకున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాలకు తావు లేకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.