గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో వద్ద కలెక్టర్ నాగలక్ష్మి నూతన అంబులెన్స్ వాహనాన్ని సోమవారం ప్రారంభించారు. గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం జనాభాకి తగిన విధంగా వైద్య సేవలకు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా అంబులెన్స్ మంజూరు చేశారన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం ప్రజా ఆరోగ్య సేవలకు నిరంతరం పనిచేస్తుందన్నారు. వైద్య రంగంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.