గుంటూరు కొత్తపేటలోని మల్లయ్య లింగం భవనంలో ఆదివారం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఉపాధ్యాయులకు నూతన పెన్షన్ విధానం రద్దు, పెండింగ్ డీఏలు మంజూరు, బకాయిలు చెల్లింపు, పీఆర్సీ కమిటీ ఛైర్మన్ నియామకం చేయాలని ఏఐఎస్టిఎఫ్ జాతీయ ఆర్థిక కార్య దర్శి జోసెఫ్ సుధీర్ బాబు డిమాండ్ చేశారు. మధ్యంతర భృతి ప్రకటన తదితర అంశాల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందించామని ఆయన పేర్కొన్నారు.