అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణం సకురు వీధిలో ఎమ్మెల్యే రాజు మట్టి వినాయక విగ్రహాలతో పాటు వ్రత కల్ప పుస్తకాలను భక్తులకు ఆదివారం పంపిణీ చేశారు. సాంప్రదాయబద్ధంగా భక్తులు మట్టి విగ్రహాలతో పూజలు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన విగ్రహాల వల్ల వాతావరణం కాలుష్యం అవుతుందన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలన్నారు.