జిల్లాలో మార్క్ ఫెడ్ ద్వారా ఇప్పటికే ప్రారంభమైన.. మైదుకూరు, కమలాపురం ఉల్లి కొనుగోలు కేంద్రాలను ఆయా ప్రాంత ఉల్లి రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో రైతుల నుండి ప్రభుత్వం చేపడుతున్న ఉల్లి కొనుగోలు ప్రక్రియపై.. జిల్లా ఇంచార్జి కలెక్టరు, జేసీ అదితి సింగ్ సంబంధిత ఉద్యాన, మార్క్ ఫెడ్ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఇంచార్జి కలెక్టరు మాట్లాడుతూ.. ఒక క్వింటాల్ ఉల్లి ధర రూ.1200 /- ప్రకారం e-క్రాప్ నమోదు చేసుకున్న రైతుల నుండి మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం ఉల్లి పంటను కొనుగోలు చేస్తుందన్నారు.