జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామంలో బేస్మెంట్ రాయి లోడుతో వెళ్తున్న టిప్పర్ వాహనం శుక్రవారం సాయంత్రం మురికి కాలువలో ఇరుక్కుపోయింది. రోడ్డు పక్కన ఉన్న మురికి కాలువలో టిప్పర్ టైర్ ఇరుక్కుపోయి ఓ ఇంటికి వాలింది. దీంతో కాసేపు గ్రామంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇతర వాహనంతో టిప్పర్ ను అక్కడి నుంచి తీసివేశారు. గ్రామాల్లో రోడ్లు ఇరుకుగా ఉండడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి కాకపోవడంతో స్థానికులు ఊపిరిపించుకున్నారు.