అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం సాయంత్రం మండల పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ ప్రధాన డిమాండ్లలో ప్రభుత్వ ఉద్యోగులుగా తమను గుర్తించాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు చొప్పున చెల్లించాలని, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ వెంటనే విడుదల చేయాలని, ఎఫ్ ఆర్ ఎస్ రద్దు చేయాలని డిమాండ్లను పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ లీడర్లు మారుతమ్మ, చంద్రకళ, అరుణ, మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.