బాపట్ల జిల్లా కేంద్రంగా వైసీపీనే చేసిందని మాజీ డిప్యూటీ స్పీకర్, బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. బాపట్లలో కోన రఘుపతి మీడియాతో ఆదివారం మాట్లాడుతూ జిల్లా కేంద్రం తరలిపోవడంపై టీడీపీ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ తమపై అబద్ధాలు వేయడం సరికాదని ఆయన విమర్శించారు. జిల్లా కేంద్రం తరలిపోతే తాను ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకుంటానని నరేంద్ర వర్మ అనడం ఏమిటని కోన రఘుపతి ప్రశ్నించారు.