అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయి నగర్ వద్ద ఉన్న జెఎన్టియు విశ్వవిద్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఉపకులపతి సుదర్శన్ రావు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపకులపతి సుదర్శన్ రావు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయ వృత్తికి ఆదర్శంగా నిలిచాడని అందుకే ఆయన పుట్టినరోజునే ఉపాధ్యాయులు దినోత్సవం జరుపుకుంటున్నామని ఉపకులపతి సుదర్శన్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డి విసి దేవన్న రిజిస్టర్ కృష్ణయ్య ఇతర హెచ్వోడీలు సిబ్బంది పాల్గొన్నారు.