అనంతపురం జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం11 గంటల 50 నిమిషాల సమయంలోరాప్తాడు నియోజకవర్గం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ భారీ బహిరంగ సభ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల్లో సగం హామీలు కూడా నెరవేర్చలేదని, అలాంటప్పుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను నిర్వహిస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలి అని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.