మహబూబాబాద్ జిల్లా లో యూరియా కోసం ప్రతి రోజు రైతులు కొట్లాడుకుంటున్న ఘటనలు పునరావృతమావుతున్నాయి. అయితే టోకెన్ల కోసం వచ్చిన రైతులను ఎస్పీ సుధీర్ రామానాథ్ కేకన్ ఆదివారం మధ్యాహ్నం 3:00 లకు క్యూ లైన్లో నిలుపుతున్నారు.. నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెంలో కూపన్లు పొందిన రైతులకు యూరియా బస్తాల కోసం తొక్కిసలాట జరగకుండా ఎస్పీ పర్యవేక్షించారు. ఎస్పీ తానే స్వయంగా దగ్గరుండి రైతులకు యూరియా బస్తాలు ఇప్పించారు.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు