నల్గొండ జిల్లా, మాడుగులపల్లి మండల కేంద్రంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బొలెరో వాహనం, ట్రాక్టర్ ఢీకొనడంతో, ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.