పామర్రు మండలం, పామర్రు లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన QR కోడ్ ఆధారిత కొత్త "స్మార్ట్" రేషన్ కార్డులను పామర్రు టౌన్ లో రేషన్ షాపు వద్ద లబ్ధిదారులకు పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పంపిణీ చేశారు. కార్యక్రమంలో కృష్ణాజిల్లా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ వల్లూరుపల్లి గణేష్,జనసేన పార్టీ ఇంచార్జ్ తాడిశెట్టి నరేష్ వారితోపాటు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.