హనుమంతునిపాడు: గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లు అనుమానం ఉంటే వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు తెలపాలని హనుమంతునిపాడు ఎస్సై కే మాధవరావు సూచించారు. సోమవారం రాత్రి మండల కేంద్రమైన హనుమంతునిపాడులో స్థానికులతో ఎస్సై మాధవరావు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామంలో దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామస్తులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, కొత్త వ్యక్తుల కదలికలను సీసీ కెమెరాలు ద్వారా తెలుసుకోవచ్చన్నారు. అదేవిధంగా సైబర్ నేరాలపై కూడా ఎస్సై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.