జీఎస్టీ రేట్లను తగ్గించి పేదలకు మేలు చేసినందుకు బీజేపీ సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు కసిరి వాసు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనదని ఆయన అన్నారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అన్ని వర్గాల ప్రజలు హర్షిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు విజయకుమార్, ద్వారకా రవి తదితరులు పాల్గొన్నారు.