కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం బాలయ్య పల్లి గ్రామస్తులు తమ గ్రామపంచాయతీ భవనం విషయంలో సమస్య పరిష్కరించాలని జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో కలెక్టర్ కు సోమవారం వినతి పత్రం ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు.తమ గ్రామమైన బాలయ్య పల్లికి నూతన గ్రామపంచాయతీ ప్రభుత్వం మంజూరు చేస్తే ఆ భవనాన్ని సాహెబ్ పల్లి లో నిర్మాణం చేస్తున్నారని తమ గ్రామానికి కేటాయించిన భవనాన్ని పక్క ఊరిలో నిర్మాణం చేస్తే మా గ్రామానికి దూరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామపంచాయతీ భూమి పూజకు వచ్చిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ను అడుగుదాం అని వెళ్తే మా గ్రామస్తులపై కేసులు నమోదు చేశారని తెలిపారు.