ఇల్లందు పట్టణంలో గణేష్ శోభాయాత్ర నిమజ్జనం ఏర్పాట్లపై పోలీస్ రెవెన్యూ మున్సిపల్ అధికారులతో, గణేష్ కమిటీ సభ్యులతో కలిసి సమీక్షా సమావేశం గురువారం ఇల్లెందు మున్సిపల్ కార్యాలయం నందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం యాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.. నిమజ్జనం చేసే స్థలాల వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు..