అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు బెయిల్ ముంజరూ చేయడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. పట్టణంలోని వైఎస్సార్ పార్టీ కార్యాలయం ఎదుట సోమవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలితో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని బాణా సంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఆక్రమ అరెస్టులకు తాము భయపడమన్నారు.