గంట్యాడ మండలం రామవరం హైవే రోడ్డు పై ఆదివారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ బలంగా ఢీకొట్టగా , రోడ్డుపై ఆగి ఉన్న లారీ దాని ముందు ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టడంతో లారీ క్యాబిన్ నూజు నుజుకగా అందులో ఉన్న క్లీనర్ అక్కడికక్కడే మృతిచెందగా, డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న గంట్యాడ పోలీసుల సంఘటన స్థలానికి చేరుకున్నారు తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ను ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.