అర్హులైన దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం పాత వైకల్య శాతాన్ని అమలు చేయాలని జనసేన పార్టీ దివ్యాంగుల నాయకుడు ఆదిశేషు అన్నారు. ఆదివారం బాపట్లలో నిర్వహించిన దివ్యాంగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అర్హులైన దివ్యాంగులకు వైకల్య శాతాన్ని తగ్గించడం వలన పలు రకాల సంక్షేమాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం పాత వైకల్య శాతాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరారు.