శ్రీ సత్య సాయి జిల్లా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వ రంగాలకు చమర గీతం పాడి ప్రైవేట్ రంగాలకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర సిపిఐ కార్యదర్శి రామకృష్ణ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షిలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై మండిపడ్డారు,దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆశయానికి అనుగుణంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిపాలన సాగిస్తూ ప్రధానంగా ప్రైవేట్ రంగాలకు పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు, విద్యా ,వైద్య ,పారిశ్రామిక రంగాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెబుతున్నారని తెలిపారు,