గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిస్కారానికి కమ్యూనిస్టు కార్యకర్తలు కృషి చేయాలని, అవసరమైతే ప్రజలను సమీకరించి ఉద్యమాలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా కోరారు.సిపిఐ జిల్లా కార్యాలయం 'శేషగిరిభవన్'లో ఆదివారం జరిగిన సిపిఐ లక్ష్మీదేవిపల్లి మండల సమితి సమావేశానికి అయన ముఖ్య అతిధిగా హరి మాట్లాడారు.గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిస్కారంకోసం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు నిరంతరం కృషి చేస్తున్నారని,మండలంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు