అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తూ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఏకంగా 11 మంది ఉపాధ్యాయులు ఎంపిక కాబడ్డారని మండల ఎంఈఓ, మరియు డివైఈవో మల్లారెడ్డి గురువారం రాత్రి 7.30 గంటలకు పేర్కొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన వారు శుక్రవారం అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాలలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో మంత్రులు జిల్లా ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.