రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామ శివారులోని రామాలయం వద్ద బుధవారం అర్థం రాత్రి గేదెను కారు ఢీ కొట్టినట్లు తెలుస్తుంది. రూ.లక్ష విలువగల గేదె మృతి చెందిందని పాడి,సన్న కారు రైతు జవ్వాజీ రాజు గురువారం ఉదయం మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.గేదెను ఢీ కొట్టిన కారు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.రైతును ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.కారు ముందుభాగం డ్యామేజ్ అయింది. కారు ఎవరిది కారులో ఉన్న వారికి ఏమైనా ప్రమాదం జరిగిందా అనే విషయాలు తెలియాల్సి ఉంది.గేదె మృతదేహం,పొదల్లో ఉన్న కారును చూస్తున్న రైతులు,అటుగా వెళ్తున్న ప్రజలు.