విభిన్న ప్రతిభావంతుల వికాసానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని విశాఖ నగర పోలీస్ కమీషనర్ డాక్టర్ శంఖ బ్రత బాగ్చి పిలిపునిచ్చారు. జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ జె.సి.ఐ. వైజాగ్ ఆధ్వర్యంలోశనివారం పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్స్ లో స్పెషల్ ఒలింపిక్స్ 2025 ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి మాట్లాడుతూ పుట్టుకతో లేదా బాల్యంలో పిల్లలకు వచ్చే వైకల్యాలను గమనించి తగిన వైద్యం అందిస్తే వారికి మెరుగైన జీవనాన్ని అందించినట్లు అవుతుందని అన్నారు. వైద్యశాస్త్రం పురోగతి సాధించిన ప్రస్తుత తరుణంలో దేశ విదేశాల వైద్య నిపుణులు ఉన్నారన్నారు